ఫోటో మూమెంట్ : శంకర వరప్రసాద్ గారి సెట్స్‌లో తిలక్ వర్మ

ఫోటో మూమెంట్ : శంకర వరప్రసాద్ గారి సెట్స్‌లో తిలక్ వర్మ

Published on Oct 16, 2025 6:27 PM IST

Tilak Varma

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మన శంకర వ‌ర ప్రసాద్ గారు” చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఆయన షూటింగ్ బ్రేక్ సమయంలో భారత క్రికెట్ యువ సంచలనం తిలక్ వర్మను ప్రత్యేకంగా సత్కరించారు.

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన ఘన విజయంలో తిలక్ వర్మ చూపిన అద్భుత ప్రదర్శన చిరంజీవిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన తిలక్ భుజాలపై శాలువా కప్పి, అతని మ్యాచ్ విజేత క్షణాన్ని గుర్తుచేసే ఫ్రేమ్‌డ్ ఫోటోను బహుమతిగా అందించారు.

ఈ కార్యక్రమంలో నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి మరియు సుష్మిత కొణిదెల కూడా పాల్గొన్నారు.

తాజా వార్తలు