ఆర్.ఎఫ్.సి లో ఆర్యతో చిందేస్తున్న అనుష్క

ఆర్.ఎఫ్.సి లో ఆర్యతో చిందేస్తున్న అనుష్క

Published on Nov 18, 2012 9:05 PM IST


ప్రస్తుతం యోగా బ్యూటీ అనుష్క తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. గత నెల ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘మిర్చి’ సినిమా షూటింగ్లో పాల్గొంది. అది పూర్తి కాగానే కార్తీ సరసన చేస్తున్న ‘బాడ్ బాయ్’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసారు. ప్రస్తుతం అనుష్క రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ‘బృందావనంలో నందకుమారుడు’ సినిమా షూటింగ్లో పాల్గొంటోంది. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని ఒకే సారి తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. తమిళంలో ‘ఇరందం ఉలగం’ అనే టైటిల్ పెట్టారు. ఇటీవలే ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని జార్జియాలో చిత్రీకరించారు. మొదట్లో ఈ సినిమా కాన్సెప్ట్ విన్నప్పుడు అందరూ దీనిని సినిమాగా తీయడం చాలా కష్టం అని అన్నారని కానీ సినిమా అనుకున్నదాని కంటే బాగా వస్తోందని సెల్వ రాఘవన్ తెలిపారు. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి హారిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని 2013లో విడుదల చేయనున్నారు.

అనుష్క ప్రభాస్ సరసన నటిస్తున్న ‘మిర్చి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తను నటించిన ‘డమరుకం’ సినిమా కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా అనుష్క గుణశేఖర్ డైరెక్షన్లో ‘రుద్రమదేవి’ సినిమా చేయడానికి అంగీకరించింది.

తాజా వార్తలు