స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటించిన ‘ఘాటి’ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క మరో పవర్‌ఫుల్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అనుష్క మొదటిసారిగా మలయాళ చిత్రసీమలో అడుగుపెడుతోంది. రొజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కథనార్ – ది వైల్డ్ సోర్సరర్’ అనే భారీ చిత్రంలో అనుష్క నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోందని.. తొమ్మిదో శతాబ్దానికి చెందిన మాయాశక్తులు కలిగిన క్రైస్తవ పూజారి కథనార్ జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోందని మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమాతో మలయాళంలో అనుష్క ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.