ఇంటర్వ్యూ : అనుష్క శెట్టి – శీలావతి పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి..!

Ghaati

సెప్టెంబర్ 5న విడుదల కానున్న ‘ఘాటి’ చిత్రంలో శీలావతి పాత్రలో కనిపించబోతున్న అనుష్క శెట్టి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాతో పాటు తన 20 ఏళ్ల సినీప్రయాణంపై ఆమె మీడియాతో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

20 ఏళ్ల జర్నీలో ఘాటి లాంటి సినిమా చేయడం ఎలా అనిపించింది?

– చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఘాటీలో శీలావతి పాత్ర అద్భుతం. ఇంతకు ముందు నేను చేయని రోల్ ఇది. బ్యూటిఫుల్ షేడ్స్‌తో, కంఫర్ట్ జోన్ దాటి చేసిన క్యారెక్టర్.

అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి తర్వాత ఈ పాత్రలో ప్రత్యేకత ఏమిటి?

– ఈ పాత్ర కూడా పవర్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ ఇందులో ఒక కొత్త షేడ్ ఉంది. మహిళలు సాధారణంగా సున్నితంగా కనిపించినా, పరిస్థితి రాగానే బలమైన స్తంభంలా నిలుస్తారు. అదే ఈ పాత్రలో చూపించారు.

కథ విన్నప్పుడు మీ మొదటి రియాక్షన్?

– క్రిష్ గారు, శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు ఆ కల్చర్ చాలా కొత్తగా అనిపించింది. లొకేషన్స్‌కి వెళ్లిన తర్వాత మరింత ఎక్సైట్మెంట్ కలిగింది.

సినిమాలో గంజాయి ఎలిమెంట్ ఉందని వినిపిస్తోంది?

– అవును, కానీ ఇది కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు. సొసైటీలో ఉన్న సీరియస్ ఇష్యూపై పాజిటివ్ మెసేజ్ కూడా ఇస్తుంది.

వేదం తర్వాత మళ్లీ క్రిష్‌తో కలసి పని చేయడం?

– చాలా స్పెషల్‌గా అనిపించింది. ఎప్పటిలాగే ఆయన నాకు అద్భుతమైన పాత్ర ఇచ్చారు. శీలావతి నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

విక్రమ్ ప్రభుతో స్క్రీన్ షేర్ చేయడం ఎలా అనిపించింది?

– ఆయన వెరీ నైస్ జెంటిల్మెన్. దేశిరాజు పాత్రకి పర్ఫెక్ట్ ఫిట్ అయ్యారు.

రాబోయే ప్రాజెక్ట్స్?

– ప్రస్తుతం నా ఫస్ట్ మలయాళ సినిమా చేస్తున్నాను. అదనంగా ఒక కొత్త తెలుగు ప్రాజెక్ట్ త్వరలో ప్రకటిస్తాను.

Exit mobile version