ఈ నెల థియేటర్స్ లో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు కౌశిక్ పగళ్ళపూడి తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “కిష్కింధపూరి” కూడా ఒకటి. లేటెస్ట్ గా ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాలో సాయి శ్రీను సరసన మరో అనుపమ పరమేశ్వరన్ నటించిన సంగతి తెలిసిందే.
మరి ఆమె నేడు ట్రైలర్ లాంచ్ కి కూడా రావడం జరిగింది. అయితే ఈ లాంచ్ లో ఆమె జ్వరంతో బాధ పడుతున్నట్టుగా రివీల్ చేసింది. తాను ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నానని కానీ సినిమా ప్రమోషన్స్ కోసమే బయటకి వచ్చినట్టుగా తెలిపింది. దీనితో ఆమెకి ఇబ్బంది ఉన్నప్పటికీ తన సినిమా కోసం ఇలా డెడికేషన్ చూపించడం అనేది తన అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇక తమ సినిమా ఈ సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.