‘ఓజి’లో తన పాత్రపై కుండబద్ధలు కొట్టిన బ్యూటీ..!

OG

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజీ’లో తనకు చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్ర లభించిందని నటి శ్రియా రెడ్డి చెప్పుకొచ్చింది. ఈ సినిమాలోని తన పాత్రతో మరోసారి తనదైన వెరైటీని చూపించడానికి ఆమె సిద్ధమవుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హై యాక్షన్‌తో పాటు మంచి మెలో డ్రామా కూడా ఉండబోతుంది. ఇందులో శ్రియా రెడ్డి పోషించిన పాత్ర బలంగా ఉండటమే కాకుండా, ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందని ఆమె చెబుతోంది.

ఓజీలో తన పాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని.. లుక్, నటనలో రియలిజానికి దగ్గరగా రావడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. తనకు వెరైటీతో పాటు అడ్వెంచరస్ రోల్స్ అంటే చాలా ఇష్టమని చెప్పిన శ్రియా రెడ్డి, ఓజిలతో తన పాత్ర మంచి ఇంపాక్ట్‌ని ఇస్తుందని ఆమె ఆశిస్తుంది.

ఓజీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్‌ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, సుజీత్ స్టైలిష్ టేకింగ్ మాత్రమే కాకుండా ఈ చిత్రంలోని పవర్‌ఫుల్ క్యాస్టింగ్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version