ప్రభాస్ ‘స్పిరిట్’ విషయంలో కొత్త ట్విస్ట్!

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాలతో పాటుగా నటించనున్న సినిమాలు కూడా చాలానే లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమా “స్పిరిట్” ఒకటి. ఇది పాన్ ఇండియా లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లోనే షేక్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా ఒక పోలీస్ యాక్షన్ డ్రామా అనుకున్నారు కానీ లేటెస్ట్ ట్విస్ట్ గా ఈ సినిమాలో సూపర్ నాచురల్ థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉన్నట్టు టాక్ వైరల్ అవుతుంది. దీనితో ఈ సాలిడ్ బజ్ ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తుండగా ఓ క్లారిటీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ మొదలు కానుంది.

Exit mobile version