గౌతం మీనన్ డైరెక్షన్ లో అనుష్క?

గౌతం మీనన్ డైరెక్షన్ లో అనుష్క?

Published on Jan 17, 2014 5:00 PM IST

Anushka
సౌత్ ఇండియన్ టాప్ కథానాయికల్లో యోగ బ్యూటీ అనుష్క ఒకరు. అనుష్క ప్రస్తుతం రెండు పీరియాడిక్ సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’, ఇక రెండవది గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రమదేవి’. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకే ఎక్కువ డేట్స్ ఇచ్చేసిన అనుష్కకి కోలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ తలుపుతట్టింది.

‘ఘర్షణ’, ‘ఏమాయ చేసావే’ సినిమాలతో తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న గౌతం మీనన్ త్వరలోనే తమిళ్ స్టార్ హీరో అజిత్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా హీరోయిన్ కోసం గౌతం అనుష్కని అనుకున్నారు. తనకి కూడా నచ్చడంతో అజిత్ – గౌతం సినిమా కోసం డేట్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. చివరికి అనుష్క డేట్స్ ఇస్తుందో లేక ఆ సినిమా అవకాశాన్ని వదులు కుంటుందో చూడాలి.

తాజా వార్తలు