నాని సరసన అనుపమ పరమేశ్వరన్ ?

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ అండ్ క్రేజీ బ్యూటీ ‘సాయి పల్లవి’ని తీసుకున్నారని.. ఇప్పటికే ఆమెతో మేకర్స్ చర్చలు కూడా జరిపారని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. అనుపమ పరమేశ్వరన్నాని సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందట.

అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి మొదట సాయి పల్లవినే మేకర్స్ సంప్రదించారట. కానీ లాక్ డౌన్ కారణంగా డేట్స్ క్రాస్ అయ్యాయట. అందుకే ఆమె ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది.అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.

Exit mobile version