ట్రైలర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘కిష్కింధపురి’.. క్వాలిటీ అదుర్స్!

Kishkindhapuri

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రాక్షసుడు సినిమా తర్వాత జంటగా చేసిన లేటెస్ట్ సినిమానే “కిష్కింధపురి”. దర్శకుడు కౌశిక్ పగళ్ళపూడి తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ చిత్రమే ఇది. మరి ఈ సినిమా నుంచి అవైటెడ్ ట్రైలర్ కట్ ని మేకర్స్ ఇపుడు విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ మాత్రం మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి.

ఒక ఊరిలో భూత్ బంగ్లా దెయ్యాలపై రీసెర్చ్ చేసే టీం లా వచ్చిన శ్రీనివాస్, అనుపమ అండ్ గ్యాంగ్ అక్కడ నిజంగానే ఉండే దయ్యం వల్ల ఎదుర్కొన్న సవాళ్లు ఈ క్రమంలో హీరో ఏం చేసాడు, హీరోయిన్ కి ఏమైంది ఆ దెయ్యం ఎవరు అనే అంశాలు మంచి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ గా కనిపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ మంచి డైనమిక్ గా ఎనర్జిటిక్ యాటిట్యూడ్ లో కనిపిస్తున్నాడు.

అలాగే తన మార్క్ సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ సినిమాలో బాగున్నాయి. ఇక వీటితో పాటుగా ట్రైలర్ లో మేకర్స్ పెట్టిన ఖర్చు తాలూకా క్వాలిటీ సాలిడ్ గా ఉందని చెప్పాలి. విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ట్రైలర్ లో టాప్ నాచ్ లో ఉన్నాయి. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం కూడా సినిమాలో బాగుంది. మొత్తానికి మాత్రం ఈ సెప్టెంబర్ 12న ప్రామిసింగ్ ప్రాజెక్ట్ ని షైన్ స్క్రీన్ వారు తీసుకొస్తున్నారని చెప్పవచ్చు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version