ఎన్.టి.ఆర్ సినిమాకి సంగీతాన్ని అందించనున్న అనూప్ రూబెన్స్!

ఎన్.టి.ఆర్ సినిమాకి సంగీతాన్ని అందించనున్న అనూప్ రూబెన్స్!

Published on May 24, 2013 5:00 PM IST

Anup-Rubens
‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ మంచి పేరును సంపాదించుకున్నాడు . ఈ నెల మొదట్లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్యలు ప్రధాన పాత్రలుగా, శ్రియ, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘మనం’కి సంగీతాన్ని అందించడానికి అంగీకరించాడు. తాజా సమాచారం ప్రకారం ఆయన ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రభస’ కి కూడా సంగీతాన్ని అందించనున్నాడు. ఇది తను తెలుగులో చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్. గత కొద్ది నెలలుగా అనూప్ సంగీతానికి ఎన్.టి.ఆర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. దానితో ఈ సినిమా నిర్మాతలు అనూప్ కు ఈ ప్రాజెక్ట్ ను ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాం.

తాజా వార్తలు