‘ఫంకీ’ని అనుదీప్ అప్పుడే తీసుకొస్తాడా..?

‘ఫంకీ’ని అనుదీప్ అప్పుడే తీసుకొస్తాడా..?

Published on Sep 20, 2025 9:00 AM IST

Funky

టాలీవుడ్‌లో కామెడీ జోనర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు కె.వి.అనుదీప్. జాతిరత్నాలు, ప్రిన్స్ వంటి సినిమాలతో ఆయన తన సత్తా చాటారు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడట ఈ డైరెక్టర్.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘లైలా’ డిజాస్టర్ తర్వాత చేస్తున్న ఈ సినిమాలో విశ్వక్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే పాత్రలో నటిస్తు్న్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను విశ్వక్ మార్క్‌తో కాకుండా అనుదీప్ తనదైన రీతిలో తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ సినిమా అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా తెరకెక్కుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాను 2026 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని అనుదీప్ భావిస్తున్నాడట. దీని కోసం ఆయన తీవ్రంగా కష్టపడుతున్నాడని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే అనుదీప్ ‘ఫంకీ’ని వచ్చే ఫిబ్రవరిలో తీసుకొస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు