రాజన్న చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు వాయిస్ ఓవర్

‘రాజన్న’ చిత్రం అన్ని హంగులతో ఈ నెల 22న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంభందించి మాకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. సీనియర్ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు గారు ఈ చిత్రం కోసం తన గొంతును వినిపించినట్లు సమాచారం.చిత్రం మొదలయ్యే సమయంలోని కొన్ని కీలక సన్నివేశాలకు ఏఎన్నార్ గారు తన వాయిస్ ఓవర్ అందించారు. నిన్న అక్కినేని నాగార్జున గారి కుటుంబసభ్యులకు కోసం ప్రసాద్ లాబ్స్ లో ప్రివ్యు షో వేయడం జరిగింది. ఈ ప్రివ్యు చూసిన వారు చిత్రం చాలా బావుందని చెప్పారు. రాజన్న చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున గారే స్వయంగా నిర్మించడం జరిగింది. రాజన్న చిత్రం నాగార్జున గారి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని
చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇప్పటికే మార్కెట్లో విడుదలై విశేష ఆదరణ లభించింది.విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం అందించగా స్నేహ నాగార్జున భార్యగా నటిస్తుంది. ఏనీ అనే పాప రాజన్న కూతురిగా ముఖ్య పాత్రలో నటిస్తుంది.

మీ కోసం ప్రత్యేకమైన కాంటెస్ట్. రాజన్న చిత్ర ఉచిత టికెట్స్ గెలవాలనుకుంటున్నారా.ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version