తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్స్ లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన 90 సంవత్సరాల వయసులో ఆయనకి స్టమక్ కాన్సర్ వచ్చిందని ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈ విషయం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఎఎన్ఆర్ ని ట్రీట్ మెంట్ కోసం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన ట్రీట్ మెంట్ వల్ల త్వరగా కోలుకుంటున్నారు. ఎఎఎన్ఆర్ మనవడైన సుమంత్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అలాగే ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని, కోలుకున్నాక అక్కినేని ఫ్యామిలీ చేస్తున్న మనం సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఈ వయసులో ఆయన ఇలా ఓపెన్ గా ముందుకొచ్చి కేన్సర్ తో పోరాడడం ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని అన్నాడు.
ఎఎన్ఆర్ చాలా త్వరగా పూర్తి ఆరోగ్యవంతుడిగా కోలుకోవాలని 123తెలుగు.కామ్ తరపున కోరుకుంటున్నాం.