జూన్ లో మొదలుకానున్న మూడు తరాల సినిమా.

Akkineni
రానున్న తెలుగు సినిమాలో ఏ.ఎన్.ఆర్, నాగార్జున మరియు నాగచైతన్య మొట్టమొదటిసారిగా కలిసి నటించనున్నారు. ‘ఇష్క్’ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాకి ‘మనం’ అనే పేరు పరిశీలనలో ఉంది.ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాగార్జున ఈ మధ్య జరిగిన ఒక వేడుకలో ఈ చిత్రం జూన్ లో మొదలుకానుంది అని తెలిపారు.

ఈ మల్టీ స్టారర్ సినిమాలో నాగార్జున, నాగచైతన్య సరసన హీరోయిన్స్ ను వెతికే పనిలో ఉన్నారు. ఆ అదృష్టం ఎవర్ని వరిస్తుందో చూడాలి. నాగార్జునని త్వరలో ‘గ్రీకువీరుడు’, ‘భాయ్’ గా చూడనున్నాం. నాగచైతన్య ‘వెట్టై’ తమిళ్ రీమేక్లో నటిస్తున్నాడు.

Exit mobile version