బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత ఏడాది లాక్ డౌన్ సమయంలో అనూహ్యంగా ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. అలాగే అంతే స్థాయిలో దేశ వ్యాప్తంగా కూడా పెను విషాదాన్ని నెలకొల్పింది. మరి ఈ ఆత్మ హత్యకు సంబంధించి అప్పుడు నుంచి చాలానే సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
అనేక మంది బాలీవుడ్ స్టార్స్ పేర్లు కూడా బయటకు రావడం కేసు సిబిఐ కు వెళ్లడం తర్వాత పేలవం కావడం అన్ని జరిగాయి. కానీ ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. సుశాంత్ మరణానికి అతని స్నేహితుడు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ రిషికేష్ పవార్ పేరును కనెక్షన్ ఉందని ఎన్ సి బి శాఖ వారు బయట పెట్టారు.
డ్రగ్స్ సంబంధిత సమాచారంలో అతని పేరు బయటకు వచ్చింది అని తెలిసింది. అంతే కాకుండా అతడు గత కొంత కాలం నుంచి దొరక్కుండా తిరుగుతున్నాడని కానీ ఫైనల్ గా పోలీసు వారు అతన్ని పట్టుకున్నారు. మరి ఇక్కడ నుంచి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.