ఇప్పుడు “ఆదిపురుష్” పై హాట్ టాపిక్ అవుతున్న మరో అంశం.!

ఇప్పుడు “ఆదిపురుష్” పై హాట్ టాపిక్ అవుతున్న మరో అంశం.!

Published on Aug 18, 2020 1:12 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాలూకా లైనప్ ఇప్పుడు మామూలుగా లేదు. ఒకదాన్ని మించిన ఒక భారీ ప్రాజెక్ట్ తో ప్రభాస్ సంచలనం రేపుతున్నాడు. అలా ఇప్పుడు తాజాగా అనౌన్స్ చేసిన మరో భారీ ప్రాజెక్ట్ “ఆదిపురుష్”. హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ భారీ ఎపిక్ వండర్ ఒక్కసారిగా అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాను ఇప్పటికే ఎన్నో భారీ హంగులతో ప్లాన్ చేశారన్న టాక్ ఖరారు అయ్యింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో అంశంపై హాట్ టాపిక్ అవుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించడం కన్ఫర్మ్ అయ్యింది. కానీ అదే ప్రధాన పాత్రదారునికి బలమైన ప్రతినాయకుని పాత్ర కూడా ఉండాలిగా, అందుకు బాలీవుడ్ నుంచి ఒక స్టార్ నటుని పేరే పరిశీలనలో ఉందట. ప్రస్తుతానికి సస్పెన్స్ గా నడుస్తున్న ఈ అంశం సినిమా షూటింగ్ మొదలు కానున్న సందర్భంలో వెలువరించనున్నట్టు తెలుస్తుంది. మరి ఆ అండర్ లో ఉన్న ఆ పేరు ఎవరిదో చూడాలి.

తాజా వార్తలు