చిరు – అనీల్ రావిపూడిల మరో సర్ప్రైజ్.. ఏంటంటే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు చేస్తున్న చిత్రాల్లో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. అయితే అనీల్ రావిపూడి సినిమాలు అంటేనే వినూత్న ప్రమోషన్లు. సినిమా దగ్గరకి వస్తున్న సమయంలో తన నుంచి వచ్చే ప్రమోషన్లే సగం మందిని థియేటర్స్ లో వచ్చేలా చేస్తాయి.

ఇక చిరుతో ప్రాజెక్ట్ కి డోస్ ఇంకొంచెం ఎక్కువే కనిపిస్తుంది. సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉన్న సమయం నుంచే ఊహించని సర్ప్రైజ్ లు తాను అందిస్తున్నారు. సినిమా అనౌన్సమెంట్ నుంచి నయనతారని పరిచయం చేయడం వరకు తన మార్క్ ప్రమోషన్స్ చూపించారు.

ఇక లేటెస్ట్ గా మరో సర్ప్రైజ్ ని కూడా తాను అందించారని చెప్పాలి. ప్రముఖ ఛానెల్ జీ తెలుగులో ఓ ప్రోగ్రాం లో స్పెషల్ సర్ప్రైజ్ గా కనిపించనున్నట్టు ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇది మాత్రం బుల్లితెర వీక్షకులకు మెగా అభిమానులకి మంచి సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ ప్రోమో వైరల్ గా కూడా మారింది. అలాగే ఈ ఎపిసోడ్ అతి త్వరలోనే టెలికాస్ట్ కి రానుంది.

Exit mobile version