ఓటీటీని షేక్ చేస్తున్న గుజరాతీ హారర్ థ్రిల్లర్ కి నెట్ ఫ్లిక్స్ రికార్డ్ ధర?

vash level 2

కొన్ని కొన్ని సినిమాలకి ఆలస్యంగా అయినప్పటికీ ఇప్పుడు ఉన్న ఓటీటీ యుగంలో ఆడియెన్స్ లో నెమ్మదిగా అయినా కల్ట్ క్లాసిక్ గా నిలుపుతున్నారు. ఇలా లేటెస్ట్ కా ఓటీటీలో సంచలనం సెట్ చేస్తున్న ఓ సినిమానే “వష్ లెవెల్ 2”. నిజానికి ఇదొక గుజరాతీ సినిమా కాగా కొన్ని రోజులు కితమే ఓటీటీ లోకి ఈ సినిమా వచ్చింది.

కేవలం గుజరాతీ, హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సినిమాకి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలన రెస్పాన్స్ కనిపిస్తుంది. ఇంతలా సంచలనం సెట్ చేస్తున్న ఈ క్రేజీ హారర్ థ్రిల్లర్ కి ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కూడా భారీ మొత్తం అందించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాని వారు మూడున్న కోట్లు పెట్టి కొన్నారట. పెద్దగా ఎవరికీ తెలీని నటీనటులు పైగా ఓ గుజరాతీ సినిమాకి ఈ రేంజ్ డీల్ అంటే అధికమే అని చెప్పాలి. అలా కొన్న ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సూపర్ రెస్పాన్స్ తో ఇండియన్ ట్రెండ్స్ లో దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రానికి కృష్ణదేవ్ యగ్నిక్ దర్శకత్వం వహించగా కల్పేష్, కృనాల్ సోనిలు నిర్మాణం వహించారు.

Exit mobile version