ఈరోజు నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఇప్పుడు ఆ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే గత కొన్ని రోజులు నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య పేరు బాగా వినిపిస్తూ వస్తుంది. అంశం ఏదైనప్పటికీ బాలయ్య పేరు అలా మారు మోగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో తన కొడుకు నందమూరి మోక్షజ్ఞ్య ఎంట్రీ కోసం చాలానే కథనాలు వినిపిస్తున్నాయి. వీటిలో ఒకటి మాత్రం ఖాయం అని చెప్పాలి. అదే మోక్షజ్ఞ్య సినీ అరంగేట్రం. ఇప్పటికే సంబంధిత పనులు చాలానే పూర్తయ్యాయని స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా అయ్యాయని బాలయ్య తెలిపారు.
దీనితో మోక్షజ్ఞ్యను ఎవరు లాంచ్ చేస్తారు అన్న విషయంలో మాత్రం చాలా మంది పేర్లే వినిపించాయి. అలా ఇప్పుడు మరో మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు కూడా వినిపిస్తుంది. బాలయ్య ఇప్పటికే పూరీని స్క్రిప్ట్ సిద్ధం చెయ్యమని కూడా చెప్పారట. ప్రస్తుతం పూర్తి విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు. మరి మోక్షజ్ఞ్యను ఎవరు లాంచ్ చేస్తారో చూడాలి.