“రాధే శ్యామ్” క్లైమాక్స్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల్లో మొదటి వరుసలో ఉన్న చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పూర్తి కావచ్చింది. ఇంకా క్లైమాక్స్ షూట్ ను మాత్రమే బ్యాలన్స్ ఉంచుకున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం ఒక స్వచ్ఛమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అందుకే పెద్దగా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవని ప్రభాస్ కూడా కన్ఫామ్ చేశారు. కానీ ఒకే ఒక్కటి ఉంటుందని తెలిపారు. ఇపుడు దీనిపైనే పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ యాక్షన్ బ్లాక్ ను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని అందుకు గాను 30 కోట్లు వెచ్చించడమే కాకుండా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ ను కూడా ఎన్నుకున్నారని టాక్ వచ్చింది.

ఇపుడు మరింత సమాచారం వినిపిస్తుంది. ఈ ఒక్కటే ఉన్న యాక్షన్ బ్లాక్ ను ఇండియాలోనే ఒక హైలైట్ గా నిలిచే యాక్షన్ బ్లాక్ గా తీర్చిదిద్దనున్నారని అలాగే చాలా ఛాలెంజింగ్ సీన్స్ తో ఉంటుందని తెలుస్తుంది. మరి ఇలాంటి పీరియాడిక్ డ్రామాలో ఎలాంటి యాక్షన్ బ్లాక్ ను డిజైన్ చేస్తున్నారో చూడాలి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Exit mobile version