‘ఓజి’ నుంచి ఇంకో క్రేజీ టాక్.. ఇంకా సర్ప్రైజులు ఉన్నాయా!

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “ఓజి” అనే చెప్పాలి. దర్శకుడు సుజీత్ కలయికలో పవన్ కళ్యాణ్ చేసిన మొదటి సినిమా అది కూడా స్ట్రైట్ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ గా నిలిచిన అంశాల్లో సంగీత దర్శకుడు థమన్ కూడా ఒకరు.

మరి థమన్ నుంచి లేటెస్ట్ గ్లింప్స్ లో వర్క్ చూసి అంతా మరింత ఇంప్రెస్ అవుతున్నారు. మరి ఇవే అనుకుంటుంటే చిత్ర యూనిట్ నుంచి ఇంకా సర్ప్రైజ్ లు ఉన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పవన్ సహా మెగా అభిమానులకి ఒక పండుగ చేసుకునే రేంజ్ సినిమా పడేలా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 25న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

Exit mobile version