మరో మోడల్ తెలుగు తెరకు పరిచయంకానుంది. రాకుల్ ప్రీత్, సారా జేన్, అంజలి లావనియ, సయామీ ఖేర్ మరియు తదితరులు ఈ రంగానికి వచ్చారు. ఇప్పుడు మరో తార అంకిత షోరే తెలుగు సినిమాలలోకి కనిపించనుంది. ఆషికీ 2 తెలుగు రిమేక్ లో సచిన్ జోషి సరసన ఈ భామ నటించనుంది
ఈ భామ ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ ను 2011లో గెలుచుకుంది. గతంలో ఈ భామ ఫ్యాషన్ షో లు, మోడలింగ్ రంగాలలో తన నైపుణ్యం చూపించింది. ఆషికీ 2 లో హీరోయిన్ పాత్రను ఆశించినా, శ్రద్దా కపూర్ ఆ అవకాశాన్ని దక్కించుకుంది. ముందుగా ఈ పాత్రకు తమన్నాను సంప్రదించినా డేట్ లు ఖాళీ లేక ఆ ఆఫర్ ను వదులుకుంది
‘బంపర్ ఆఫర్’ తీసిన జయ రవీంద్ర ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. వైకింగ్ మీడియా బ్యానర్ మరియు బండ్ల గణేష్ సమర్పకుడు