బోల్ బచ్చన్ రీమేక్ కు డబ్బింగ్ ప్రారంభించిన అంజలి

బోల్ బచ్చన్ రీమేక్ కు డబ్బింగ్ ప్రారంభించిన అంజలి

Published on Aug 30, 2013 1:00 AM IST

Anjali
సినిమాల విషయంలో కాక ఇతర విషయాలలో ఈ మధ్య వార్తలలో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఒక నిర్మాతను పెళ్లి చేసుకుని తిరుగుతుందని పుకార్లు వినిపించాయి. అయితే ఈ కధనాలకు నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్రస్తుతం వెంకటేష్, రామ్ లు నటిస్తున్న ‘బోల్ బచ్చన్’ రీమేక్ లో నటిస్తున్న అంజలి ప్రస్తుతం డబ్బింగ్ చెబుతుంది. అంతేకాక సెప్టెంబర్ 3 న వెంకటేష్ తో కలిసి పాట చిత్రీకరణకై చైనా వెళ్లనుంది. అంతేకాక నిర్మాత ఆమెను, ఆమె నటనను పొగిడాడు. తన బ్యాడ్ లక్ అనాలో ఏంటో అంత మంచి నటి అయిన అంజలి ప్రస్తుతం అవసరంలేని వివాదాలను ఎదుర్కుంటుంది. ఇవన్నీ త్వరలో తొలిగి ఆమెకు మంచి భవిష్యత్ కలగాలని ఆశిద్దాం

తాజా వార్తలు