‘కింగ్డమ్’.. అనిరుద్ రివ్యూ వచ్చేసింది

మన టాలీవుడ్ సెన్సేషనల్ ది విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే “కింగ్డమ్”. గ్రాండ్ ట్రైలర్ తర్వాత మేకర్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ నుంచి వచ్చిన రివ్యూ వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో అనిరుద్ ఒక సినిమాకి పని చేస్తూ దానికి ముందే ఒక కాన్ఫిడెన్స్ రివ్యూ ఇస్తూ ఉంటాడు. అలానే ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కింగ్డమ్ కోసం చెప్పేసాడు. ఈ సినిమా విజయ్ కి, తనకి అలాగే గౌతమ్ కెరీర్లో ఒక మైల్ స్టోన్ గా నిలిచే సినిమాలా ఉంటుంది అని కితాబిచ్చాడు. దీనితో అనిరుద్ రివ్యూతో అభిమానులు మరింత కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నారు. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ జూలై 31న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

Exit mobile version