పెద్ద ప్రమాదంలో పడిన అనిరుధ్

పెద్ద ప్రమాదంలో పడిన అనిరుధ్

Published on Jan 31, 2014 12:30 AM IST

Anirudh-Ravichander
కోల’వెర్రి’లో కొట్టుకుపోయిన ప్రజలకు అనిరుధ్ పరిచయం అవసరం లేని పేరు. ఈ సంగీత దర్శకుడు ఇటీవలే “ఆయింట్ నూబడీ ఫ*గ్ విత్ మై మ్యూజిక్” అనే పేరుతో యు ట్యూబ్ లో ఒక ఆల్బమ్ ను విడుదల చేశారు. కాకపోతే ఆ పాటలో లిరిక్స్ విన్న చెన్నై ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. అమ్మాయిలపై అత్యంత అసభ్యంగా రాసిన ఆ పాటకు సంగీతాన్ని అందించినందుకు సదరు ఒక లాయరు కోర్టులో కేసు కూడా వేశాడు

ప్రస్తుతానికి ఇతగాడికి వచ్చిన కష్టమేమీ లేకపోయినా ముందుగా కేసును ఫైల్ చెయ్యమని, నేరం గనుక ఋజువు అయితే కఠినంగా శిక్షిస్తామని పోలీసులకు మద్రాసు హై కోర్టు తెలిపింది. అన్నిటికంటే ఇతను చేసిన తప్పేమిటంటే ఆ వీడియో ను సెన్సార్ తీసుకోకుండా పోస్ట్ చెయ్యడం. మరికొన్ని రోజులలో ఈ కేస్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం

ప్రస్తుతానికి అనిరుధ్ మూడు భారీ తమిళ చిత్రాలలో బిజీగా వున్నాడు. అందులో గౌతమ్ కార్తీక్, లావణ్య నటిస్తున్న నానుమ్ రౌడీథాన్ సినిమా ఒకటి. దీనిని గౌతమ్ మీనన్ నిర్మిస్తున్నారు

తాజా వార్తలు