డైలాగ్ రైటర్ గా స్టార్ట్ అయి… వరుస సక్సెస్ లతో సూపర్ ఛాన్స్ కొట్టేసి.. డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్సకత్వంలో కామెడీ కింగ్ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కలిసి ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నాడు. మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు కూడా పూర్తవుతాయట. ఈ చిత్రాన్ని నవంబర్ నెల నుండి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం వెంక్కీ ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు అక్టోబర్ సమయానికి పూర్తవుతాయట. వీటి తర్వాత చేయడానికి వరుణ్, వెంకీలు ఇంకా వేరే కొత్త చిత్రాలకు సైన్ చేయలేదు. అందుకే అదే సమయానికి ‘ఎఫ్ 3’ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు, అనిల్ రావిపూడి.