రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. కాగా ఈ సినిమా పాజిటివ్ రివ్యూలతో ప్రారంభమైంది. పైగా బాక్సాఫీస్ వద్ద నిలకడగా ప్రదర్శన ఇస్తోంది. యూఎస్ఏ లో, శుక్రవారం విడుదలైన ఈ చిత్రం $350K వసూళ్లు సాధించింది. ప్రస్తుతం అక్కడ ఈ సినిమా $500K మార్కుకు దగ్గరలో ఉంది. ఒకవిధంగా అక్కడ ఇవి మంచి కలెక్షన్సే.
ఐతే, రామ్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న $1 మిలియన్ మైలురాయిని మాత్రం ఈ సినిమా చేరుకోలేకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం ‘అఖండ 2’ రాబోతుంది. యూఎస్ఏ లో డిసెంబర్ 4, 2025న ‘అఖండ 2’ ప్రీమియర్ లు పడబోతున్నాయి. కాబట్టి, ఆంధ్ర కింగ్ తాలూకా $1 మిలియన్ మార్కును దాటే అవకాశాలు ఇక లేనట్టే. మొత్తానికి ఈ చిత్రం మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్లు వసూలు చేసింది. మరి ఈ ఆదివారం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.


