అందాల రాక్షసి విడుదల తేది ఖరారు


1990 నేపధ్యంలో జరిగే ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ‘అందాల రాక్షసి’ చిత్రాన్ని ఆగష్టు 10న విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విశేషాలను తెలియ జేయడానికి ఈ రోజు హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో రాజమౌళి, దిల్ రాజు, సాయి కొర్రపాటి మరియు హను రాఘవపూడి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఈ చితాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు ఆగష్టు 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలియజేశారు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ రాజమౌళి సహ నిర్మాతగా వ్యవహరించారు. దిల్ రాజు మరియు రాజమౌళి ఈ చిత్రంలో బాగాస్వాములవడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో హను రాఘవపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లావణ్య, నవీన్ చంద్ర మరియు రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందించారు.

Exit mobile version