బుల్లి తెరపై పాపులర్ యాంకర్ గా దూసుకెళుతున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్దమయ్యాడు. గతంలో ఆయన చాల సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయలేదు. మొదటిసారి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేయనుట్లు తెలుస్తుంది.
తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ఈనెల 25న ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీ విడుదల కానుంది. కాగా ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలుగా ఉన్న గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ తీసుకున్నాయట. వీరే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారని తెలుస్తున్న సమాచారం. అలాంటి ప్రొడక్షన్ హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే, మూవీకి బాగా కలిసొచ్చే అంశమే. ఇక ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించారు. గతంలో ఈయన సుకుమార్ సినిమాలకు అసిస్టెంట్ గా చేశారు.