నానితో పోరుకు సిద్ధమైన యాంకర్ ప్రదీప్

నానితో పోరుకు సిద్ధమైన యాంకర్ ప్రదీప్

Published on Mar 7, 2020 10:57 PM IST

నాని 25వ చిత్రంగా వస్తున్న ‘వి’ పై భారీ అంచనాలు ఉన్నాయి. హీరో నాని మొదటి సారి ఓ నయా రోల్ ట్రై చేస్తుండగా ఇటీవల విడుదలైన టీజర్ ఆ అంచనాలు మరింత పెంచేసింది. ఇక నానిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన అష్టాచెమ్మా, జెంటిల్ మెన్ మంచి విజయం సాధించాయి.

కాగా నాని సినిమాకు పోటీగా యాంకర్ ప్రదీప్ దిగుతున్నాడు. ఆయన నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నాని వి మూవీ కూడా అదే రోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. భారీ అంచనాల మధ్య వస్తున్న నాని ‘వి’ ముందు సుధీర్ తట్టుకొని నిలబడగాలడా అనేది ఆసక్తికరంగా మారింది. ఐతే ఈ రెండు చిత్రాలు భిన్న నేపథ్యం మరియు జోనర్స్ కి సంబందించినవి కాబట్టి, వీటి మధ్య పోటీ అంతగా ఉండకపోవచ్చు.

తాజా వార్తలు