కొంపల్లిలో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్‌ను హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య ఘనంగా ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో పెంపుడు జంతువులకు అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభోత్సవంలో డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి, ఫౌండర్ & ఛైర్మన్ డా. శ్రీ రెడ్డి, ఎండీ సంధ్య బి. రెడ్డి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
డా. శ్రీ రెడ్డి మాట్లాడుతూ, జుబ్లీహిల్స్ బ్రాంచ్ తర్వాత కొంపల్లిలో కూడా పెట్ హాస్పిటల్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పెంపుడు జంతువులకు ఎంఆర్ఐ స్కానింగ్, వివిధ విభాగాలు, విదేశీ వైద్యుల ఇంటరాక్షన్ సెషన్స్ వంటి ప్రత్యేక సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, వైద్యులకు ఆకర్షణీయమైన వేతనాలు కల్పిస్తున్నామని చెప్పారు.
డా. సంధ్య బి. రెడ్డి మాట్లాడుతూ, ఆర్థికంగా బలహీనమైనవారి పెంపుడు జంతువులకు హెర్మాయిన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా లేదా 50% రాయితీతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, పెట్స్ తమ కుటుంబ సభ్యుల్లా మారిపోయారని, పెట్స్‌కు మంచి వైద్యం అందించడంలో సెవెన్ ఓక్స్ హాస్పిటల్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కొత్త బ్రాంచ్ ద్వారా కొంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల వారికి మరింత సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, తాను పెట్ లవర్ అని, తన పెట్ ఆల్ఫాకు కూడా ఇక్కడే చికిత్స చేయించామని, ఇప్పుడు కొంపల్లిలో బ్రాంచ్ ప్రారంభం వల్ల స్థానికులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, పెట్స్‌కు మంచి వైద్యం అందించడంలో సెవెన్ ఓక్స్ ఆస్పత్రి విశ్వసనీయంగా నిలుస్తోందని తెలిపారు.