అనామిక లో అంతర్లీనంగా ఒక సందేశం వుంది: శేఖర్ కమ్ముల

అనామిక లో అంతర్లీనంగా ఒక సందేశం వుంది: శేఖర్ కమ్ముల

Published on Nov 21, 2013 2:02 AM IST

sekhar-kammula

ఈ ఏడాది మొదట్లో విద్యాబాలన్ నటించిన ‘కహానీ’ సినిమాను శేఖర్ కమ్ముల రిమేక్ చేస్తున్నాడు అనగానే ఆశ్చర్యం కలిగింది. అతను తీసే సినిమాలకు పూర్తిగా భిన్నంగా థ్రిల్లర్ నేపధ్యంలో సాగనుంది. కానీ నిజానికి దర్శకుడు ఈ సినిమాను ఎంచుకోవడానికి బలమైన కారణం వుంది.

“ఈ సినిమా కహానీ నుండి ప్రేరణ పొంది తెలుగు తమిళ వెర్షన్ లలో పలు మార్పులు చేసాము. ఈ సినిమాను తీయడానికి నిర్భయ సంఘటన ఒక కారణం. అన్నిటికంటే ముఖ్యంగా నాకు స్త్రీ సహకార ఉద్యమం అంతే చాలా ఇష్టం. ఈ పరిస్థితులన్నీ నన్ను ఈ సినిమా తీయడానికి ప్రేరేపరించాయి. ఈ థ్రిల్లర్ కంటే అంతర్ముఖంగా ఇందులో ఒక మెసేజ్ వుంది” అని దర్శకుడు తెలిపాడు

ఈ సినిమాలో నయనతార ప్రధానపాత్ర పోషించగా వైభవ్ రెడ్డి, హర్షవర్ధన్ రానే ముఖ్య పాత్రలు పోషించారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకానుంది

తాజా వార్తలు