విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘సత్య2’ సినిమాతో తెరకి పరిచయం అయ్యే చాన్స్ కొట్టేసిన హీరోయిన్ అనైక. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ బాషలలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే అనైక కోలీవుడ్లో డైరెక్ట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతోంది. వసంత బాలన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ద్వి బాషా చిత్రం ‘కావియా తలైవన్’ సినిమా కోసం అనైక ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా చేస్తున్న సిద్దార్థ్ సింగర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా 1920లలో జరుగుతుంది. ఈ సినిమాని ఎస్.జి కిట్టప్ప – కేబి సుందరంబాల్ లను స్పూర్తిగా తీసుకొని చేస్తున్నారు. ఈ సినిమాలో అనైక యువరాణిగా కనిపించనుంది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో సెట్స్ పైకి వెళ్తుంది.
అనైక నటించిన తొలి సినిమా సత్య2 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ‘ ఈ సినిమాలో బాగా ఇంటెలిజెంట్ అయిన ఓ వ్యక్తి క్రిమినల్ కావాలని నిర్ణయించుకుంటాడు. నేను క్రైమ్ అనేదానికి అంతం లేదని నమ్ముతాను. క్రైమ్స్ ని చూపించాలన్నది నా ఉద్దేశం కాదు నాకు క్రిమినల్స్ సైకాలజీ అంటే చాలా ఇష్టం’ అని రామ్ గోపాల్ వర్మ అన్నాడు.