“వెట్టై” మరియు “లవ్ ఫెయిల్యూర్” చిత్రాలు విజయం సాదించడంతో అమల పాల్ కు తెలుగు మరియు తమిళ పరిశ్రమలో చాలా అవకాశాలు వచ్చాయి కాని అమల పాల్ తన భవిష్యత్తు ప్రాజెక్ట్ విషయంలో ఆచి తూచి అడుగేస్తున్నారు.వి.వి.వినాయక్ మరియు రామ్ చరణ్ తేజ్ చిత్రం మినహా మరే చిత్రం ఒప్పుకోలేదు.
తాజా సమాచారం ప్రకారం అమలా పాల్ భారీ మళయాళ చిత్రాన్ని ఒప్పుకుంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర చేస్తున్నారు అని తెలియగానే వెంటనే అమలా పాల్ ఈ చిత్రానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్రం పేరు “రన్ బేబీ రన్”. ఈ నెలాఖర్లో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు పెట్టుకోబోతుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.