“పుష్ప” కోసం వీరి నడుమ అప్పుడే గట్టి పోటీ.!

“పుష్ప” కోసం వీరి నడుమ అప్పుడే గట్టి పోటీ.!

Published on Feb 4, 2021 8:00 AM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. బన్నీ మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో దీనిపై అంతే స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అయితే ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్ వరకు ప్రతీది మరిన్ని అంచనాలు పెంచుతూ వచ్చింది.

అయితే ఇంకా సగం కూడా పూర్తి కానీ ఈ భారీ చిత్రం కు అప్పుడే సాలిడ్ ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయట. ముఖ్యంగా అయితే దిగ్గజ స్ట్రీమింగ్ యాప్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు పోటీ పడుతున్నారట. మరి ఈ చిత్రానికి ఆ హక్కులు ఎంత పలుకుతాయో చూడాలి. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు