1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో రాబోతున్న ‘‘పలాస 1978” సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేక ప్రివ్యూ షో వేసుకుని చూశారని.. సినిమా ఆయనకి బాగా నచ్చిందని ముఖ్యంగా దర్శకుడు కరుణ కుమార్ పనితనం ఆయనను బాగా ఆకట్టుకుందని.. అందుకే కరుణ కుమార్ కి తమ బ్యానర్ లో ఆఫర్ కూడా ఇచ్చాడని.. మేము ఇప్పటికే తెలియజేశాము.
కాగా తాజాగా అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా చేయడానికి కరుణ కుమార్ కు అడ్వాన్స్ ఇస్తూ అధికారికంగా ప్రకటించారు. దర్శకుడికి చెక్ ఇస్తోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్ బ్యానర్. అయితే ఈ సినిమాలో హీరో అల్లు శిరీష్ నా లేక, వేరే హీరోతో చేస్తారా అనేది త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకం పై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ‘పలాస 1978′ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే హిట్ టాక్ తెచ్చేసుకుంది.