అల్లు శిరీష్ గౌరవం విడుదల ఏప్రిల్ కి మారనుందా??

Allu-Sirish-in-Gauravam
అల్లు శిరీష్ మొదటి చిత్రం ‘గౌరవం’ ఈ వేసవి చివర్లో రానుంది. ఈ సినిమాకి ఇంకా రెండు మూడు రోజుల చిత్రీకరణ తప్ప మిగిలిన భాగమంతా పూర్తయింది. తెలుగు, తమిళ్ లో రాధా మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ ఈ సినిమాని నిర్మించాడు. హానర్ కిల్లింగ్స్ నేపధ్యంలో నడిచే ఈ సోషల్ డ్రామాలో ప్ర్రకాష్ రాజ్ , యామి గౌతం ప్రధానమైన పాత్రలు పోషించారు. ముందుగా ఈ సినిమాని ఫిబ్రవరిలోనే విడుదల చేద్దాం అనుకున్న ప్రకాష్ రాజ్ కు రెండు భాషలలో ఒకేసారి విడుదల చేయడం ప్రస్తుతం అతను ఎదుర్కుంటున్న పెద్ద సమస్య.

ఇదిలా ఉండగా, అల్లు శిరీష్ తన నటనపై ఆనందంగా ఉన్నాడు. ముఖ్యంగా అతనిని ప్రకాష్ రాజ్ అభినందించిన తరువాత మరీ ఆనంద పడ్డాడు. “ప్రకాష్ రాజ్ గారు గౌరవం రషస్ చూసారు. అందులో నా పనితీరుకు మెచ్చుకున్నారు. ఆనందంగా అనిపించింది. ఇంకా రెండు, మూడు రోజుల ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. నా డబ్బింగ్ ముగిసింది. సినిమా తమిళ్, తెలుగు లో తీయడం వలన తమిళనాడు, ఆంధ్రాలో ఫ్రీ డేట్ ఉండాలి కనుక, విడుదల తేది ఇంకా దృవీకరించలేదు. మార్చ్ చివర్లో కానీ ఏప్రిల్ మొదట్లో కానీ విడుదల చేయడానికి చూస్తున్నామని ” అల్లు శిరీష్ ట్విట్టర్లో చెప్పాడు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.

Exit mobile version