ఒక్క హిట్టు కోసం రూటు మార్చిన అల్లు శిరీష్..?

allu-sirish

అల్లు శిరీష్ కెరీర్‌లో ఇప్పటివరకు సరైన హిట్ దొరకలేదు. ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’ వంటి సినిమాలు ఓకే అనిపించుకున్నా, బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయాయి. గత ఏడాది వచ్చిన ‘బడ్డీ’ కూడా విఫలమైంది. ఈ నేపథ్యంలో శిరీష్‌కు ఇప్పుడు హిట్ అత్యవసరమైంది.

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో శిరీష్ సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. యాక్షన్ సినిమాల జోలికి వెళ్లకుండా, పక్కా కామెడీ ఎంటర్టైన్మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. ఇప్పటికే ఆయన ఓ స్క్రిప్టుకు ఓకే చెప్పాడని.. ఈ చిత్రానికి ‘బచ్చలమల్లి’ ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహించబోతున్నాడని సినీ సర్కిల్స్ టాక్. సుబ్బు ఫన్ టచ్ ఉన్న కథను సిద్ధం చేశాడని తెలుస్తోంది.

కామెడీ సరిగ్గా వర్కవుట్ అయితే శిరీష్‌కు ఇది ఖచ్చితమైన హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.

Exit mobile version