SSMB29 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన కెన్యా మంత్రి

SSMB29

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ SSMB29 ప్రాజెక్ట్ కోసం యావత్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ చిత్రంగా రాజమౌళి తెరకెక్కిస్తుండగా, పూర్తి అడ్వెంచర్ చిత్రంగా ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతుంది.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అధికశాతం కెన్యా దేశంలో చేయనున్నారు. దీనికోసం రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే కెన్యాలోని లోకేషన్‌లను ఫిక్స్ చేశారు. కాగా, కెన్యా దేశానికి చెందిన ఫారిన్ ఎఫైర్స్ క్యాబినెట్ సెక్రటరీతో పాటు ఇతర మంత్రులతో రాజమౌళి అండ్ టీమ్ తాజాగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెన్యా క్యాబినెట్ సెక్రటరీ రాజమౌళి లాంటి విజనరీ డైరెక్టర్ తమ దేశంలో సినిమా షూటింగ్ చేసుకోవడం సంతోషంగా ఉందని.. తమ దేశంలోని అందాలను యావత్ ప్రపంచానికి చూపెట్టేందుకు రాజమౌళి అండ్ టీమ్ చేసిన ప్రయత్నానికి తాము అభినందనలు తెలుపుతున్నామని.. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చిత్రాన్ని 120కి పైగా దేశాలలో రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.

దీంతో SSMB29 చిత్రం ప్రపంచస్థాయిలో ఎంత హైప్ క్రియేట్ చేయనుందో అర్థమవుతోంది. ఇన్ని దేశాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు కెన్యా దేశానికి చెందిన మంత్రి చెప్పడంతో ఇప్పుడు ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version