ఇంటర్వ్యూ : హీరోయిన్ శివానీ నాగరం – ‘లిటిల్ హార్ట్స్’ సినిమా మీ కాలేజ్ డేస్ గుర్తు చేస్తుంది!

Shivani-Nagaram

‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. బన్నీవాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ శివానీ నాగరం మీడియాతో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

– మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ద్వారా ఈ మూవీకి వచ్చాను. స్టోరీ విన్న వెంటనే ఎగ్జైటింగ్‌గా అనిపించింది.

– అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు తర్వాత మంచి కంటెంట్ కోసం వెయిట్ చేశాను. లిటిల్ హార్ట్స్ లైట్ హార్టెడ్ కాలేజ్ ఫన్ లవ్ స్టోరీ.

– నేను కాత్యాయని అనే క్యారెక్టర్ చేశాను. ఇది యూత్‌కి బాగా రిలేట్ అవుతుంది. కాలేజ్ డేస్ గుర్తు చేస్తుంది.

– షూటింగ్ సమయంలో కో-ఆర్టిస్ట్‌లతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం. రాజీవ్ కనకాల, అనిత చౌదరి, సత్యకృష్ణ, కాంచి లాంటి వారితో పనిచేయడం మంచి అనుభవం.

– ఈ సినిమా నాకు స్కూల్, కాలేజ్ డేస్ గుర్తు చేసింది. బన్నీవాస్, వంశీ నందిపాటి కంటెంట్ నమ్మి రిలీజ్ చేస్తున్నారు.

– మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. “రాజాగాడికి” సాంగ్ నాకు ఫేవరెట్.

– ఓటీటీ, థియేటర్ అనే తేడా చూడను. మంచి కంటెంట్ అయితే చేస్తాను. వెబ్ సిరీస్‌లు చేయాలనే ఆసక్తి కూడా ఉంది.

– నా నెక్ట్స్ ప్రాజెక్ట్ హే భగవాన్ (సుహాస్‌తో) హిలేరియస్ ఎంటర్‌టైనర్. మరో రెండు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

Exit mobile version