యానిమేషన్ రంగంలో అగ్ర నిర్మాత

యానిమేషన్ రంగంలో అగ్ర నిర్మాత

Published on Apr 26, 2013 2:04 AM IST

Chhota-Bheem
అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ త్వరలో ఒక యానిమేషన్ సినిమాను మన రాష్ట్రంలో పంపిణీ చెయ్యనుంది. ఈ సినిమా పేరు ‘చోట భీం అండ్ ది త్రోన్ ఆఫ్ బాలి’, రాజీవ్ చిలక దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తను సమీర్ జైన్ తో పాటూ నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రోమో ఈ మధ్యే హైదరాబాద్లో విడుదల చేసారు. ఈ వేడుకకు దర్శక నిర్మాలతోపాటు అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. ఈ యానిమేషన్ భాధ్యతలు చేపట్టిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ, గీతా ఆర్ట్స్ తో పాటూ టై అప్ అయ్యారు.

‘చోటా భీమ్’ గురించి మాట్లాడుతూ అల్లు అరవింద్ “చోటా భీమ్ పిల్లలో అత్యంత ప్రజాదరణ పొందింది. రాజీవ్ చిలక ఈ పాత్రను ముఖ్య పాత్రగా తీసుకుని చక్కగా కధ అల్లాడు. ఎనభయో దశకంలో అమెరికా డిస్నీల్యాండ్ లో మిక్కీ మౌస్, డోనాల్డ్ డక్ కు ఉన్న ఆదరణ చూసి నివ్వెరపోయాను. ఆ కాలంలో మన ఇండియన్ సినిమాలో ఇలాంటి సినిమాలు నా తరువాత తరం వారైన తియ్యాలని అనుకున్నా. కానీ నేను ఉహించిన దానికంటే ముందే మన దేశంలో అడుగుపెట్టిందని “అన్నారు. ఈ 2డి యానిమషన్ సినిమాకోసం 200 మందికి పైగా పనిచేసారు. ‘చోట భీం అండ్ ది త్రోన్ ఆఫ్ బాలి’ సినిమా మే 3 న ఆంధ్ర ప్రదేశ్ లో 50 థియేటర్లలో విడుదలకానుంది.

తాజా వార్తలు