అల్లు అర్జున్ క్యారవాన్ కి ప్రమాదం !

అల్లు అర్జున్ క్యారవాన్ కి ప్రమాదం !

Published on Feb 6, 2021 6:11 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఉపయోగిస్తున్నఓ ఖరీదైన క్యారవాన్ పై గతంలోనే వార్తలు రావడం జరిగింది. అయితే తాజాగా ఈ వ్యాన్ ఒక చిన్న ప్రమాదానికి గురైంది. ఈ రోజు పుష్ప షూట్ నుండి తిరిగి వస్తున్నప్పుడు ఖమ్మం శివార్ల సమీపంలో ఈ వ్యాన్ ఒక చిన్న ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఒక లారీ వెనుక నుండి వ్యాన్ ను ఢీ కొట్టింది. అదృష్టవశాత్తూ ఎటువంటి తీవ్రమైన నష్టం జరగలేదు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన అలాంటి ఖరీదైన క్యారవాన్ ఇండియా లోనే ఏ స్టార్ హీరో కూడా ఉపయోగించడం లేదంట. దీనితో అల్లు అర్జున్ క్యారవాన్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ ఐయ్యింది. ఐతే ఈ ఖరీదైన వానిటీ వ్యాన్ గురించి అల్లు అర్జున్ ఆ మధ్య బన్నీ చెబుతూ “జీవితంలో నేను కొనే ప్రతి విలువైన వస్తువు కొన్న ప్రతిసారి నాకు గుర్తొచ్చే విషయం, మీరు నాపై చూపిన అభిమానం ప్రేమవలనే వాటిని నేను పొందగలుగుతున్నాను, అందుకు మీకు నా కృతఙ్ఞతలు, ఇది నా వానిటీ వ్యాన్ , ఫాల్కన్” అని అప్పట్లో దీని గురించి పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు