స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రేస్ గుర్రం’. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. తాజా షెడ్యూల్ ఈ శనివారం నుంచి మొదలు కానుంది, అలాగే షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ సినిమాని 2014 జనవరిలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సలోని ఓ కీలక పాత్రలో కనిపించనుంది. హీరో పాత్రని కాస్త విభిన్నంగా చూపించే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. ఈ భారీ బడ్జెట్ మూవీని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.