అట్లీ కోసం అల్లు అర్జున్ ఆ రిస్క్ చేస్తాడా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సూపర్ హీరో మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇప్పుడు దీనిపై మరో కొత్త గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కాకుండా నాలుగు పాత్రలు చేస్తున్నాడని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో ఆయన పాత్రలు ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

అయితే, ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే సెలెక్ట్ అయింది. ఆమెతో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నలుగురు హీరోలకు నలుగురు హీరోయిన్లు ఉండేలా అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Exit mobile version