క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ అయింది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల మూడో వారం నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో ఓ సాంగ్ షూట్ చేయనున్నారు.
ఇక ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటం కారణంగా సినిమాలో చాల క్యారెక్టర్స్ ఉంటాయని.. ఆ క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ ఫీల్ అవుతున్నాడట. ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు.
ఇప్పుడు కూడా బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే చేస్తున్నాడు. ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.