మరోసారి పూరితో పనిచెయ్యనున్న అల్లు అర్జున్

మరోసారి పూరితో పనిచెయ్యనున్న అల్లు అర్జున్

Published on Jun 3, 2013 7:05 PM IST

allu-arjun-puri
‘ఇద్ధరమ్మాయిలతొ..’ సినిమా తరువాత అల్లు అర్జున్ మరియు పూరి జగన్నాధ్ మరోసారి కలిసి పనిచెయ్యనున్నారు. ఈరోజు పూరి మీడియాతో మాట్లాడుతూ “అల్లు అర్జున్ ఒక వ్యక్తిగా మరియు ఒక నటుడిగా మంచి పరిణితి సాధించాడు. ‘ఇద్ధరమ్మాయిలతొ..’ సినిమాలో తన పాత్రలోకి తాను చాలా త్వరగా ప్రవేశించిన విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మేమిద్దరం మరోసారి కలిసి పనిచెయ్యాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం దానికి కధ సిద్ధం చేసే పనిలోవున్నానని “తెలిపాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కూడా దృవీకరించారు. ఈ సినిమా వచ్చే యేడాది ప్రారంభంకావచ్చు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

ఇదిలావుండగా పవన్ కళ్యాణ్ మీద ‘ఇద్ధరమ్మాయిలతొ..’సినిమాలో పూరి వేసిన పంచ్ గురించి మాట్లాడుతూ “మేము ఆ డైలాగ్ ద్వారా ఎవ్వరినీ కించపరచాలని అనుకోలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ ను. చిరంజీవి గారు ఈ సినిమాలో ఆ సీన్ చూస్తున్నప్పుడు చాలా నవ్వారు. అల్లు అరవింద్ కూడా ఎంజాయ్ చేసారు. అల్లు అర్జున్ కు బాగా నచ్చిన సీన్ అది. బన్నీ కూడా పవన్ కు పెద్ద ఫ్యాన్ కనుక ఆ డైలాగ్ ఒక మంచి కాంప్లిమెంట్ గా అనుకుని తీశాం. ఎవరైనా నొచ్చుకుని వుంటే క్షమించండి” అని అన్నారు.

తాజా వార్తలు