ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రొఫెషనలిజం, తన పని పట్ల చూపించే నిబద్ధత ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది. రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో జరిగిన వ్యక్తిగత విషాదాన్ని మనసులో దాచుకొని, తన వల్ల తన నెక్స్ట్ సినిమాకు ఎలాంటి అంతరాయం కలగకుండా వెంటనే షూటింగ్‌కి హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ AA22 సెట్స్‌పై ఎలాంటి ఆటంకం రాకూడదని భావించి తన బాధను పక్కనబెట్టి ఆ సినిమా షూట్ కోసం తిరిగి ముంబై వెళ్లిపోయాడు.
ఇలా తన పర్సనల్ లాస్‌ను సైతం పక్కనబెట్టి పనిలో మునిగిపోవడం ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనం అని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సినీ వర్గాలు, అభిమానులు అల్లు అర్జున్ ఈ ప్రొఫెషనలిజాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తన వ్యక్తిగత పరిస్థితులను పక్కన పెట్టి, ప్రాజెక్ట్‌కి ప్రాధాన్యత ఇవ్వడం ఆయనకు ఉన్న బాధ్యత భావాన్ని స్పష్టంగా చూపిస్తుందని వారు అంటున్నారు.
ఇక అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో అల్లు అర్జున్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తాడని, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.