విడుదల తేదీ : ఆగస్టు 29, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్, చందు సలీమ్ కుమార్, నిషాంత్ సాగర్, రఘునాథ్ పలెరి, విజయరాఘవన్, నిత్యశ్రీ, తదితరులు
దర్శకుడు : డామినిక్ అరుణ్
నిర్మాత : దుల్కర్ సల్మాన్
సంగీతం : జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి
ఎడిటింగ్ : చమన్ చక్కో
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మలయాళంలో తెరకెక్కిన లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటించింది. మరి ఈ సూపర్ హీరో సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
చంద్ర అలియాస్ నీలి (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది. ఒక మిషన్‌లో ఆమె తృటిలో శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. దీంతో మూతోన్(మమ్ముట్టి వాయిస్) ఆమెను రహస్యంగా ఉండాలంటూ హెచ్చిరిస్తాడు. దీంతో చంద్ర బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి సైలెంట్‌గా జీవిస్తుంది. ఆమె పక్కింట్లో ఉండే సన్నీ(నస్లేన్) ఆమెతో స్నేహం పెంచుకుని ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ(శాండి మాస్టర్)కి చంద్రపై అనుమానం వస్తుంది. ఇంతకీ అతడికి చంద్రపై అనుమానం ఎందుకు వచ్చింది..? అసలు చంద్ర ఎవరు..? సన్నీ ఎందుకు అంతగా భయపడతాడు..? గతంలోని ఎలాంటి నిజాలు ఆమెను భయభ్రాంతులకు గురిచేస్తాయి..? అనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
మన భారతీయ సినిమాల్లో సూపర్ హీరో జోనర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా సూపర్‌హీరో సినిమాలు చాలా తక్కువ. ఈ క్రమంలో ఆ లోటును భర్తీ చేసేందుకు మలయాళ సినిమా మేకర్స్ లోక చిత్రంతో మనముందుకు వచ్చారు. టైటిల్ పాత్రలో కళ్యాణి ప్రియదర్శి చాలా ఈజ్‌తో నటించింది. ఆమె తన హావభావాలను పలికించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎమోషన్‌తో పాటు యాక్షన్‌లోనూ అదరగొట్టింది.
సాధారణంగా సూపర్ హీరో సినిమాల్లో హీరో ఓ పెద్ద విలన్‌తో యుద్ధం చేస్తుంటాడు. అయితే, లోక చిత్రంలో ఇలాంటి నేపథ్యం కాకుండా వరల్డ్ బిల్డింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమా ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను నెలకొల్పే విధంగా మేకర్స్ తీర్చిదిద్దారు.
కేరళ జానపద గాథలను ఆధునిక సూపర్‌హీరో టెంప్లేట్‌తో ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. జానపద గాధలకు సూపర్ హీరోను కలపడాన్ని డామినిక్ అరుణ్ బాగా హ్యాండిల్ చేశాడు.
ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్‌ను అద్భుతంగా రాసుకున్నాడు. అంతేగాక, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఈ సీక్వెన్స్‌ను సూపర్‌గా నిలిపింది. జేక్స్ బిజోయ్ తన సంగీతంతో ఈ సీక్వెన్స్‌ను ఎలివేట్ చేసిన తీరు బాగుంది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్ కూడా ఇదే తీరులో ఉన్నాయి.
ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికి వస్తే, నస్లేన్ తన పాత్రలో బాగా సూట్ అయ్యాడు. నాచియప్ప గౌడ పాత్రలో శాండీ మాస్టర్ పర్వాలేదనిపిస్తాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా కుదిరాయి. కళ్యాణి ప్రియదర్శన్ చేసిన స్టంట్స్ ఆకట్టుకుంటాయి. గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది. ఈ సినిమాలో టోవినో థామస్ కేమియో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథలో భావోద్వేగం మరింత లోతుగా చూపెట్టాల్సింది. చంద్ర-సన్నీ మధ్య ఏర్పడే బంధం తొలుత బాగానే అనిపించినా, సెకండ్ హాఫ్‌లో అది నీరసంగా మారుతుంది. ఈ అంశాన్ని మరికాస్త జాగ్రత్తగా తీయాల్సింది.
ఒక సూపర్‌హీరో కథకు బలమైన విలన్ అవసరం. కానీ నాచియప్ప గౌడ పాత్ర పవర్‌ఫుల్ ఇంపాక్ట్ చూపెట్టలేకపోతుంది. సెకండ్ హాఫ్‌లో స్లో పేస్ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తుంది. యూనివర్స్ బిల్డింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో నెరేషన్ కొంచెం బోరింగ్‌గా అనిపించింది.
చంద్ర చుట్టూ చాలా సపోర్టింగ్ పాత్రలు తిరిగినా వాటికి సరైన ప్రాధాన్యత దక్కలేదనిపిస్తుంది. దీంతో కథలో కాస్త కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది.
సాంకేతిక విభాగం :
డామినిక్ అరుణ్ డైరెక్షన్ మరియు రైటింగ్‌లో బోల్డ్ అటెంప్ట్ చేశాడని చెప్పాలి. రైటింగ్‌లో ఇంకాస్త షార్ప్‌నెస్ ఉండాల్సింది. టెక్నికల్ ఈ సినిమా ఆకట్టుకుంటుంది. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, గ్రాఫిక్స్ వర్క్ బాగా పని చేశాయి. ఎడిటింగ్ మరికొంత బెటర్‌గా ఉండాల్సింది. డబ్బింగ్ వర్క్ కూడా బాగుంది.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’ ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్‌ను ఎస్టాబ్లిష్ చేయడంలో ఉపయోగపడింది. టెక్నికల్‌గా ఆకట్టుకునే ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ నటనతో మెప్పిస్తుంది. ఒక మహిళా సూపర్‌హీరో సినిమాగా కేరళ జానపదాలను కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, స్లో పేస్, బలహీనమైన విలన్ పాత్ర, ఆకట్టుకోని సెకండాఫ్ ఈ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. అయినా డామినిక్ అరుణ్, దుల్కర్ సల్మాన్ టీమ్ ఇలాంటి సూపర్ హీరో కథను ఎంచుకున్నందుకు వారిని అభినందించాలి. లోక చిత్రంలో కొన్ని లోపాలు ఉన్నా, ఇండియన్ సూపర్ హీరో చిత్రంగా ప్రేక్షకులకు బిగ్ స్క్రీన్‌పై ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team