‘ఓజి’ కథ ఇదేనట.. పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం..!

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజి’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా ‘ఓజి’ చిత్రం కథ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓజస్ గంభీర ముంబై అండర్‌వరల్డ్ నుంచి మాయమవుతాడు. ఈ క్రమంలో చీకటి రాజ్యాన్ని ఏలుతున్న ఓమి భావు(ఇమ్రాన్ హష్మి) ఆగడాలను అరికట్టేందుకు దాదాపు పదేళ్ల తర్వాత ఓజస్ గంభీర తిరిగి వస్తాడు. ఇక ఆ తర్వాత ఓజస్ గంభీర ఎలాంటి ఊచకోత చేస్తాడు అనేది ఈ సినిమాలో మనకు చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ స్టోరీ లైన్ చూస్తుంటే గతంలో రజనీకాంత్ నటించిన భాషా చిత్రాన్ని గుర్తుచేస్తుంది. మరి ముంబై అండర్‌వరల్డ్ నుంచి ఓజస్ గంభీర ఎందుకు మాయమవుతాడు.. అనేది మనకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ స్టోరీలైన్‌తో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version